Sumadhura svaramula ganalato – సుమధుర స్వరముల గానాలతో

Deal Score+11
Deal Score+11

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2)
|| సుమధుర ||
1 ఎడారి త్రోవలో నేనడచిన – ఎరుగని మార్గములో నను నడిపిన
నా ముందు నడిచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము (2)
|| సుమధుర ||
2 సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము (2)
|| సుమధుర ||
3 వేలాది నదులన్ని నీమహిమను – తరంగపు పొంగులు నీబలమును
పర్వత శ్రేణులు నీకీర్తినే – ప్రకటించుచున్నావేగా (2)
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన (2)
|| సుమధుర ||

          Install our App and copy lyrics !

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks . #face protect shield #clear face shield #protect shield #face shield #face protect #facial shield #KN95 FaceMask #Face Mask

Tags:

Please Add a comment below if you have any suggestions Thank you & God Bless you!

      Leave a reply

      Tamil Christians songs book
      Logo
      Register New Account
      Reset Password